ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ 'రిటర్న్ అఫ్ ది డ్రాగన్'.ఎలాంటి అంచనాలు ఏమి లేకుండా ఒక సాధారణ సినిమాగా విడుదలై, కంటెంట్ వేరే లెవెల్ లో ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోయింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషలకు కలిపి పది రోజులకు గాను 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఆ జాబితాలో విక్రమ్, సూర్య వంటి వారు ఉన్నారు. అలాంటి రోజులు నడుస్తున్న ఈ కీలక సమయంలో కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి రెండు సినిమాలతో 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇదే ఊపులో ప్రదీప్ దూసుకుపోతే, అతి త్వరలోనే ఆయన యూత్ ఐకాన్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డైరెక్టర్ గా, హీరోగా, స్టోరీ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా ప్రదీప్ రంగనాథన్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. రాబోయే రోజుల్లో ఈయన ఇంకా ఏ స్థాయికి చేరుకుంటాడో చూడాలి.
#Dragon crosses 100crs pic.twitter.com/RVvQetBy2u
— Pradeep Ranganathan (@pradeeponelife) March 2, 2025
![]() |
![]() |