ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సునీల్ ఆ సినిమా తరువాత నుంచి 'ఏయ్ ఆకాశ్' అని పిలవడం మొదలుపెట్టాడు: ఆకాశ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2019, 02:05 PM

'ఆనందం' సినిమా చూసినవాళ్లు హీరో ఆకాశ్ చాలా బాగున్నాడ్రా అనుకున్నారు. అమ్మాయిలు ఆయనపై మనసు పారేసుకున్నారు. తెలుగులో ఆయన బిజీ హీరో అవుతారని చాలామందే అనుకున్నారు. కానీ ఆయన ఊహించనిస్థాయిలో వెనుకబడిపోయాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ సునీల్ గురించి ప్రస్తావించాడు.


'అందాల రాముడు' సినిమా కోసం సునీల్ బతిమాలితే ఆ సినిమాలో రెండో హీరోగా చేశాను. అందుకోసం నేను ఒక తమిళ సినిమాను కూడా వదులుకున్నాను. కానీ 'అందాల రాముడు' పోస్టర్లో నా స్టిల్ ఒక్కటి కూడా కనిపించనీయలేదు. ఆ సినిమా హిట్ అయిన తరువాత సునీల్ ఏ స్టేజ్ పైనా గురించి ఒక్కమాట కూడా చెప్పలేదు. అంతకుముందు 'భయ్యా .. భయ్యా' అనేవాడు, ఆ తరువాత నుంచి 'ఏయ్ ఆకాశ్' అని పిలవడం మొదలుపెట్టాడు. ఆయనలా మారిపోవడం నాకు చాలా బాధ కలిగించింది" అని చెప్పుకొచ్చాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa