సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ29. తాజాగా ఈ చిత్రం ఒడిశాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకటి లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, సెట్టింగ్ కు సంబంధించిన విజువల్స్ బయటికి వచ్చాయి. ఆ సెట్టింగ్స్ చూస్తేనే మహేశ్ బాబుతో రాజమౌళి ఎంత పెద్ద సినిమా తీస్తున్నాడో అర్థమవుతోంది. సెట్ పై ఉన్నవారిలో ఒకరు సెల్ ఫోన్ తో ఈ వీడియో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa