ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొంతకాలం క్రితం వచ్చిన 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఆయన 'కేజీఎఫ్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
మైత్రీ మూవీస్ అధినేత యెర్నేని నవీన్ రీసెంట్ గా మాట్లాడుతూ, ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెప్పారు. అటు ప్రశాంత్ నీల్ తోను .. ఇటు ఎన్టీఆర్ తోను చర్చలు జరుపుతున్నామని అన్నారు. ప్రశాంత్ నీల్ చెప్పే కథ ఎన్టీఆర్ కి నచ్చితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెప్పారు. అందువలన ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తోన్న ఎన్టీఆర్, ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడం ఖాయమేనని అనుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa