ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య కొత్త చిత్రంపై తాజా వార్త

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2019, 03:53 PM

బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ చేసిన 'జై సింహా' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఇదే కాంబినేషన్లో మరో సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇది ఎప్పుడు సెట్స్  పైకి వెళుతుందా అని బాలయ్య అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.


ఆగస్టు 7వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారనేది తాజా సమాచారం. తొలి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారట. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో అక్కడ కొన్ని సన్నివేశాలను .. నాయకా నాయికలపై పాటలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికలుగా సోనాల్ చౌహన్ .. వేదికల పేర్లు వినిపిస్తున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa