పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహరవీరమల్లు' సినిమా విడుదలతేదీ మరోసారి వాయిదా పడబోతోంది. ఈ విషయాన్ని ఇంకా నిర్మాత ఎం. దయాకర్ రావు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫిల్మ్ నగర్ లో ఈ వార్త విశేషంగా చక్కర్లు కొడుతోంది. బ్రిటీషర్స్, మొగలాయి చక్రవర్తుల కాలానికి సంబంధించిన చారిత్రక కథతో ఎ.ఎం. రత్నం సమర్పణలో 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ తొలి భాగం దాదాపు పూర్తయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ పై ఓ కీలక ఘట్టాన్ని రాజస్థాన్ లో చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. దానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో అనివార్యంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేయబోతున్నారని సమాచారం. ఆ ఎపిసోడ్ లేకుండానే సినిమాను విడుదల చేయాలని కూడా మేకర్స్ భావించారట. అయితే... అత్యంత కీలకమైన ఆ ఘట్టం లేకుండా విడుదల చేస్తే... అభిమానులు నిరాశ పడే ఆస్కారం ఉందని భావించి, దానికంటే విడుదలను వాయిదా వేయడమే బెటర్ అని అనుకున్నారట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా దాదాపుగా పూర్తి చేసిన బృందం ఈ చిత్రాన్ని ఇప్పుడు ముందు అనుకున్న మార్చి 28న కాకుండా మే 9న విడుదల చేస్తుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa