ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయం తప్ప మీరేదైనా అడ‌గండి: అనుపమ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2019, 08:30 PM

టీంఇండియా క్రికెటర్లుకి సినిమా హీరోయిన్స్ మధ్య లవ్ స్టొరీస్ నడవడం అనేది కొత్తేమి కాదు . ఓ హీరోయిన్ , ఓ క్రికెటర్ ఎక్కడినా కలిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎదో ఉందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం సహజమే కూడా .. హార్థిక్ పాండ్యా, ఎల్లీ అవ్‌రమ్.. కేఎల్ రాహుల్, నిధి అగర్వాల్ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య లవ్ ఉందని పుకార్లు జోరుగా వినిపించాయి . తాజాగా అ జాబితాలోకి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా మరియు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేరిపోయారు . గత కొద్ది రోజులుగా వీరు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి . అయితే దీనిపైన ఎవరు స్పందిచలేదు . రోజురోజుకు వీటిపైన వార్తలు ఎక్కువ కావడంతో అనుపమ స్పందిచారు . ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు అనే సినిమాల్లో నటిస్తుంది అనుపమ . అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా మీకు బుమ్రాకి మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందా లేకా మరేమైనానని ఓ విలేకరి ఈ ప్రశ్నను అడగగా నో కామెంట్ అని స్పందిచింది అనుపమ.. ఆ విషయం తప్ప మీరేదైనా అడ‌గండి అంటూ చెప్పుకొచ్చింది అనుపమ .. దీనితో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకుంటున్నారు నెటిజన్లు ..


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa