నటుడిగా యాభై ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సాయికుమార్‌కు 2024 సంవత్సరానికి గాను కొమరం భీమ్ జాతీయ పురస్కారం అందజేయనున్నట్లు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ సి.పార్థసారథి, కో చైర్మన్ నాగబాల సురేశ్‌కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. పన్నెండేళ్లుగా భారత కల్చరల్ అకాడమి, ఆదివాసి సాంస్కృతిక పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డ్‌ను అందచేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నెల 23న కొమరం భీమ్ జిల్లా ఆసిఫాబాద్‌లో జరిగే కార్యక్రమంలో సాయికుమార్‌కు అవార్డ్ అందజేస్తామని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa