సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం చేస్తున్న దర్బార్ చిత్రంలోని పోలీస్ గెటప్ లుక్ లీక్ అయింది. ఈ ఫొటో ఇప్పుడు నెంటింట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లుక్‌లో రజనీకాంత్ ముంబాయి పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎక్కువ భాగం ముంబాయిలోనే చిత్రీకరణ జరుగుతోంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. నయన తార, యోగి బాబు, నివేదా థామస్, జతిన్ శర్మ వంటి వారంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Darbar, Rajinikanth, cop, AR Murugadoss
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa