విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' నిన్న థియేటర్స్ కి వచ్చింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించింది. ఈ జోడీకి గల క్రేజ్ కారణంగా తొలి రోజునే ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 7.49 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తెలంగాణలో విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందువలన ఒక్క నైజామ్ ఏరియాలోనే నిన్న ఒక్క రోజునే ఈ సినిమా 3 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం వరకూ మరే సినిమా బరిలో లేకపోవడం, ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa