నటి మాళవిక మోహనన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాసాబ్‌లో ప్రభాస్‌తో కలిసి నటించడం తన కెరీర్‌లో ఓ మైలురాయి అని, పాత్రల కోసం ఆయన చూపించే నిబద్దత ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు. అంత స్టార్ డమ్ ఉన్నా సెట్స్‌లో చాలా సింపుల్‌గా ఉంటారని, నటించే ప్రతి సీన్‌కు ఓ ఎనర్జీని తీసుకొస్తారని వెల్లడించారు. ఈ మూవీలో ఉండే మ్యాజిక్‌ను ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారని పేర్కొన్నారు.తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘సర్దార్-2’ తో అయినా తన క్రేజ్ పెరుగుతుందని భావించిన ఫ్యాన్స్‌కు ఇక్కడ కూడా నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. రీసెంట్‌గా కార్తీకి లెగ్ ఇంజ్యూరీ కావడంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈ మూవీ కూడా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో అనుకున్న టైంకి ఈ సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో.. ఈ అమ్ముడుకి క్రేజ్ రావడానికి ఇంకొంచెం టైమ్ పట్టేలాగే ఉంది. అయితే.. ఈ రెండే కాకుండా మాళవిక చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ ‘హృదయ పూర్వం’ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ మూవీతో అయినా మాళవికకు మంచి రోజులు వస్తాయేమో వేచి చూడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa