ధనుష్ హిందీలో నటించిన రాన్‌జానా అతనికి అక్కడ మంచి గుర్తింపే తెచ్చింది. అయితే తమిళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రం తరువాత హిందీలో తనకు వచ్చిన ఆవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే తాజాగా అతను రాజ్‌జానా దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో మరో హిందీ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు ఆనంద్, హీరో ధనుష్ ఇద్దరూ ధృవీకరించారు. అంతేకాదు ఈ చిత్రంలో ధనుష్ సరసన సారా అలీఖాన్ ఎంపిక చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఆనంద్ ఎల్.రాయ్ ఇంతకుముందు షారుక్‌ఖాన్‌తో తీసిన జీరో తీవ్ర ఆశాభంగం కలిగించింది.
