శర్వానంద్, కాజల్, కల్యాణి ప్రియదర్శిని నటిస్తున్న చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని ”పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్” పాటను సోమవారం విడుదల చేశారు. రణరంగం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకువస్తోంది.”పిల్ల పిక్చర్ పర్పెక్ట్” గీతాన్ని కృష్ణ చైతన్య రచించారు. సన్నీ ఎం.ఆర్. స్వరరచన చేశారు. శర్వానంద్, కాజల్ అగర్వాల్‌పై ఈ పాటని చిత్రీకరించారు. క్లాస్, మాస్‌ను ఆకట్టుకునే విధంగా చిత్రీకరణ ఉంటుందని చిత్రబృందం ద్వారా తెలిసింది. గాయని నిఖిత గాంధీ ఈ పాటని ఆలపించారు. రణరంగం కోసం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఇవి ముగింపుదశకు చేరుకున్నాయి. ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తామని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
ఈ చిత్రానికి మాటలు: అర్జున్, కార్తీక్, ఛాయాగ్రహణం: దివాకర్ మణి, సమర్పణ : పిడివి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన, దర్శకత్వం: సుధీర్ వర్మ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa