ఓటీటీ మాధ్యమం ఎంత పవర్‌ఫుల్‌గా మారిందో తెలిసిందే! సినిమాలకు దీటుగా ఓటీటీ కంటెంట్ ఉంటుందన్నది నిజం. డిఫరెంట్ కథలతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లను రూపొందించి దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. యువతరం తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక మంచి వేదికగా నిలిచింది. ఈ క్రమంలో ఓటీటీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని నెటిజన్లకు అందిస్తోంది ‘ఓటీటీప్లే’ . ‘వన్ నేషన్.. వన్ అవార్డ్’ పేరుతో ఓటీటీ వేదికగా సత్తా చాటిన నటీనటులు, దర్శకులకు అవారులను ప్రదానం చేస్తోంది. తాజాగా మూడో ఎడిషన్ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల ఓటీటీ ప్రేక్షకులను అలరించిన చిత్రాళు, వెబ్‌సిరీస్‌లకు అవార్డులు దక్కాయి.
ఉత్తమ చిత్రం: గర్ల్స్ విల్ బి గర్ల్స్ (అలీ ఫజల్ అండ్ రిచా చద్దా)
ఉత్తమ దర్శకుడు (ఫిల్మ్): ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ నటుడు (పాపులర్): మనోజ్ బాజ్‌పాయ్ (డిస్పాచ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అనుపమ్ ఖేర్ (విజయ్69, ది సిగ్నేచర్)
ఉత్తమ నటి (పాపులర్): కాజోల్ (దోపత్తి)
ఉత్తమ నటి (క్రిటిక్స్): పార్వతి తిరువొత్తు (మనోరథంగళ్)
ఉత్తమ విలన్: సన్నీ కౌశల్ (ఫిర్ ఆయే హసీనా దిల్‌రుబా)
ఉత్తమ హాస్యనటి : ప్రియమణి (భామాకలాపం2)
ఉత్తమ నటనా ప్రతిభ: అవినాష్ తివారి (ది మెహతా బాయ్స్)
ఉత్తమ నటనా ప్రతిభ: షాలినీ పాండే (మహరాజ్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa