మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నూతన చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండో - కొరియన్ హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్, యు.వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రితికా నాయక్ కథానాయిక. వరుణ్ తేజ్ హీరోగా 15వ చిత్రమిది.ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాని ఎస్‌ఎస్. తమన్ సంగీతం అందించనున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుంది. ఆపరేషన్ వాలంటైన్, మట్కా చిత్రాలతో పరజయం చవిచూసిన మెగా ప్రిన్స్ ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసిగా ఉన్నారు. దానికి తగ్గట్టే మేర్లపాక గాంధీ కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa