ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య సినిమాలో నమిత

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2019, 03:40 PM

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 7వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు.  బాలయ్య సరసన కథానాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదికలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు మరో కీలకమైన పాత్ర కోసం 'నమిత'ను తీసుకున్నట్టుగా సమాచారం. నెగెటివ్ షేడ్స్ తో నమిత పాత్ర సాగుతుందని, ఈ సినిమాలో ఆమెనే విలన్ అనే మాట కూడా వినిస్తోంది.  ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అదే టైటిల్ ను ఖాయం చేస్తారా? లేదంటే మరో టైటిల్ ఏదైనా నిర్ణయిస్తారా? అనేది చూడాలి.  ఇదివరకే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం భూమికను తీసుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa