ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరుతో మరోసారి కాజల్...

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2019, 05:27 PM

మెగాస్టార్ చిరంజీవి జోడీగా కాజల్ చేసిన 'ఖైదీ నెంబర్ 150' భారీ విజయాన్ని సాధించింది. మెగాస్టార్ తో  సినిమా చేయడానికి కొరటాల శివ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో చిరంజీవి కనిపించనుండడంతో కథానాయిక పాత్ర కోసం నయనతార, అనుష్క లను తీసుకునే అవకాశం వున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలకు తెరదించే విధంగా తాజాగా కాజల్ పేరు తెరపైకి వచ్చింది. ఇంతకుముందు  చిరంజీవి సరసన నాయికగా కాజల్ మంచి మార్కులు కొట్టేసింది. అందువలన కొరటాల ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం కాజల్ కి  పారితోషికం భారీగానే ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa