బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 11లోను సైకిల్ తొక్కే ప్రోగ్రాం కంటిన్యూ అయింది. నీరు, గ్యాస్, హౌజ్ యాక్సెస్ కోసం నిరంతరం సైకిల్ తొక్కాలని బిగ్ బాస్ ఆదేశించడంతో ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా సైకిల్ తొక్కుతూనే ఉన్నారు. ఆ మధ్యలో బాబా భాస్కర్- శ్రీముఖిల మధ్య సరదా సన్నివేశాలు, తమన్నా- అలీ రాజా మధ్య హాస్యాస్పద సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అయితే తమన్నా తాను తిన్న ప్లేట్స్ కడగడం లేదని ఇంటి సభ్యులు అనడంతో రెచ్చిపోయిన తమన్నా.. నేను బౌల్‌లో తిన్నా.. అది కడిగేసాను అంటూ గట్టిగా అరచింది. ఇక రవికృష్ణకి తమన్నా పలు సూచనలు చేస్తుండగా, ఆయన విసుక్కున్నాడు. ఆడవాళ్ళు ఆడే డ్రామాలు నువ్వు ఆడకు. మగాడిలా ఉండూ అంటూ రవికృష్ణపై ఫైర్ అయింది తమన్నా.
ఇక కొద్ది సేపటి తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా మహేష్‌కి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా స్టోర్ రూంలో ఉన్న దీపాన్ని తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో ఉంచి ఆరకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో మహేష్ పలు వస్తువులని అడ్డుగా పెట్టి ఆరకుండా చూశారు. ఇంతలో బిగ్ బాస్.. దీపం కనిపించేలా పెట్టాలని చెప్పడంతో వరుణ్‌తో పాటు వితికా, పునర్నవి అండ్ బ్యాచ్ చప్పట్లు కొట్టడంతో హర్ట్ అయ్యారు హిమజ, శివజ్యోతి. దీనిపై హిమజ .. వరుణ్ సందేశ్‌తో మాట్లాడుతున్న సమయంలో శివజ్యోతి కూడా ఎంటరై అతనికి పెద్ద క్లాసే పీకింది.
మహేష్‌కి సలహా ఇచ్చింది నేనే. ఒకవేళ అది తప్పు అయితే బిగ్ బాస్ చెబుతారు. నేను తప్పు చేసినట్టు మీరు చప్పట్లు కొట్టి అవమానించడం సరికాదు అని శివజ్యోతి పేర్కొంది. ఇలా కాసేపు శివజ్యోతితో వాదించిన వరుణ్.. తప్పునాదేలే సారీ అనడంతో.. నిన్ను సారీ అడిగానా? చప్పట్లు కొట్టారు అంటే నువ్ ఎందుకు రియాక్ట్ అవుతున్నావని మరింత ఏడ్చేసి రచ్చ చేసింది శివజ్యోతి. ఇక అంతలో ఎంటరైన పునర్నవి .. వాళ్లంతా అమ్మలక్కలులా మాట్లాడుకుంటారు... మనం ఏదో సరదాగా చప్పట్లు కొడితే తెగ ఫీల్ అయిపోతున్నారు అంటూ చెప్పుకొచ్చింది పునర్నవి.
ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా గ్యాస్ సైకిల్ తొలగించేందుకు శ్రీముఖి, అలీరాజాకి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా వంద పిడికలని గోడకి వేయాలని చెప్పారు. వంద కంటే ఎక్కువ పిడకలే వేసిన ఈ జంట తమ గ్యాస్ కొరతని తీర్చుకున్నారు. ఇక వాటర్ సైకిల్‌ని తొలగించేందుకు వితికాకి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన చేపల బాక్స్ నుండి 50 కాయిన్స్ తీసి బౌల్‌లో వేయాలని చెప్పారు. ఇచ్చిన టైంలో దాదాపు 60 కాయిన్స్ తీసింది వితికా. దీంతో వారికి వాటర్ సమస్య కూడా తీరింది . మరోవైపు మహేష్ కూడా దీపాన్ని ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడటంతో ఈవారం లగ్జరీ బడ్జెట్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు కంటెస్టెంట్స్.
ఇక బిగ్ బాస్ హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్‌లో చెత్త పెర్ఫామెన్స్ ఇచ్చిన ఇద్దరి పేర్లు సూచించాలని బిగ్ బాస్ ఆదేశించగా.. తమన్నా, వరుణ్‌లు తమకు తామే చెత్త పెర్ఫామెన్స్‌గా ప్రకటించుకున్నారు. దీంతో బిగ్ బాస్ వారికి జైలు శిక్ష విధించారు. తదుపరి ఆదేశం వచ్చే వరకు జైల్‌లోనే ఉండాలని చెప్పారు. దీంతో జైలులోకి వెళ్లిన తమన్నా మంచంపైన పడుకునేందుకు సిద్దం కాగా, వరుణ్ సందేశ్ చాపపై పడుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే తాను అంత కష్టపడ్డప్పటికి చెత్త పర్‌ఫార్మెన్స్ విభాగంలో సెలక్డ్ కావడం బాధ అనిపిస్తుందని తోటి సభ్యులతో చెప్పుకొచ్చింది తమన్నా. అంతే కాదు తనకు ఏసీ లేకపోతే అస్సలు నిద్రపట్టదని శ్రీముఖితో తన బాధని వెళ్లగక్కింది. ఈ సీజన్‌లో తొలిసారి జైలుకెళ్లే ఛాన్స్ వీరిద్దరికి దక్కింది. మొత్తానికి పదకొండో ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగానే సాగగా, నేటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు లగ్జరీ బడ్జెట్‌ని ఎలా ఉపయోగించుకుంటారో తెలియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa