ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్‌పుత్. కెరియర్‌లో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ అమ్మడు ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలని సెలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. డిస్కోరాజా చిత్రంలో రవితేజ సరసన కథానాయికగా నటిస్తున్న ఈ అమ్మడు వెంకీ మామలో వెంకటేష్‌తో జోడీ కట్టింది. రీసెంట్‌గా సీత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆర్‌డీఎక్స్ అనే చిత్రం చేస్తుంది. శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రధన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ఉంటుందని సమాచారం. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది. ఇందులో పాయల్ లుక్ అభిమానుల మతులు పోగొడుతుంది. ఫస్ట్‌లుక్‌ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం కూడా మరో ఆర్ఎక్స్ 100 మూవీలా ఉంటుందని అనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa