ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి నుంచి నా సినిమా మొదలవుతుంది: రేణు దేశాయ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2019, 03:03 PM

 తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, ప్రస్తుతం మరాఠీ సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా వున్నారు. త్వరలో తెలుగులోను ఆమె ఒక సినిమాను రూపొందించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందించారు.తెలుగులో నేను ఒక సినిమాను రూపొందిస్తున్న మాట నిజమే. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. తెలంగాణ నేపథ్యంలో రైతుల సమస్యలకి సంబంధించినదిగా సాగే కథ ఇది. ఆ యాసలో స్క్రిప్ట్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇది ఒక ఆర్టు సినిమాలా అనిపించకూడదు అలాగని చెప్పేసి పూర్తి కమర్షిల్ మూవీగా కనిపించకూడదు. ఈ రెండింటి మధ్య కథ ఆత్మ దెబ్బ తినకుండా తెరకెక్కించవలసి ఉంటుంది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందిఁ అని చెప్పుకొచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa