'విక్రాంత్ రోణ' సక్సెస్ తర్వాత బాద్ షా కిచ్చా సుదీప్ దర్శకుడు అనూప్ భండారి మళ్లీ కలిసి భారీ అంచనాలున్న చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి 'బిల్లా రంగ బాష' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం 2209 ADలో సెట్ చేయబడిన భవిష్యత్తు ప్రపంచాన్ని ఒక సంగ్రహావలోకనం ఇస్తూ దాని అద్భుతమైన కాన్సెప్ట్ వీడియో మరియు అధికారిక లోగోను ఇటీవలే విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ బ్లడ్ ని రేపు అంటే ఏప్రిల్ 16న ఉదయం 9 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa