గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ దంపతులు కొత్త ఇంటి కోసం వేట సాగిస్తున్నారు. హాలీవుడ్ కేంద్రమైన లాస్ ఏంజిల్స్‌లో వీరిద్దరూ స్థిరపడాలనుకుంటున్నారు. అక్కడే అత్యంత విలాసవంతమైన భవంతిని కోనుగోలు చేయాలనుకుంటున్నారు. తమ కొత్తింటి కోసం ఈ జంట కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా? ఏకంగా 20 మిలియన్ డాలర్లు (141 కోట్ల రూపాయలు).వివాహానికి ముందు నిక్ జోనాస్‌కు బెవర్లీ హిల్స్‌లో ఓ బంగళా ఉండేది. అప్పట్లో 6.5 మిలియన్ డాలర్లకు కోనుగోలు చేసిన నిక్ గత నెలలో ఆ ఇంటిని 6.9 డాలర్లకు అమ్మేశాడు. ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన ఇంటి కోసం ప్రియాంకతో కలిసి వేట సాగిస్తున్నాడు. ప్రస్తుతం నిక్ జోనాస్ ఆస్తుల విలువ 25 మిలియన్ డాలర్లు కాగా, ప్రియాంక సంపద 28 మిలియన్ డాలర్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa