ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రివిక్రమ్ ని మరిచారా ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 07, 2019, 07:55 PM

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు .. ఈ సినిమా ఇటివలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకుంది .గతంలో వచ్చిన మన్మధుడు సినిమాకి ఇది కొనసాగింపు .. అయితే సినిమా ఈవెంట్ లో భాగంగా నాగ్ మన్మధుడు సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ని తెగ పొగిడాడు . కానీ ఇదే సినిమాకి కథ -మాటలు అందిచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నాగ్ మాట్లాడలేదు . ఇదే విషయాన్నీ సోషల్ మీడియాలోను మరియు మీడియా సంస్థలు నాగ్ త్రివిక్రమ్ ని మరిచావా అని ప్రశ్నించాయి .  ఈ నేపధ్యంలో నాగ్ సమాధానం ఇస్తూ "నాకు సినిమా కథ చెప్పింది ఆ యన , నన్ను రోజు కలుస్తూ సినిమాలోని పంచ్ డైలాగ్స్ చెప్పింది అయన కాబట్టి ఆయన గురించే మాట్లాడను నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్" అంటూ నాగ్ సమాధానం ఇచ్చాడు . మన్మధుడు 2 ఆగస్టు 9 న విడుదల కానుంది .









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa