నటి జ్యోతిక సినిమాల్లో రీఎంట్రీ తర్వాత వరుసగా ఆమె వైవిధ్య కథలను ఎంచుకుంటు ంది. ఇటీవల ఆమె నటించిన ‘రాక్షసి’, ‘జాక్‌పాట్’ చిత్రాలు కొన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో జేజే ప్రట్రిక్ అనే కొత్త దర్శకుడి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘పొన్‌మగల్ వందాల్’ అని పేరు పెట్టారు. దీంతోపాటు కార్తితో కలిసి ఓ చిత్రం చేస్తున్నారు. మరోవైపు కొత్తగా ఇరా.శరవణన్ దర్శకత్వంలోని సినిమాను కూడా అంగీకరించారు. గ్రామీణ నేపథ్యంలో కథ నడుస్తుందని సమాచారం. ఇందులో శశికుమార్, సముద్రఖనిలు కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. సూరి హాస్యపాత్రలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa