సెలక్టివ్ పాత్రలు చేసే నిత్యామీనన్ ఈ సారి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో అడపాదడపా మెరిసే ఈ అమ్మడు మలయాళంలో ఆరమ్ తిరుకల్పన పేరుతో తెరకెక్కే చిత్రంలో నటిస్తోంది. ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. పోలీస్ అధికారితో కలిసి నేర పరిశోధన చేసే పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తుందట. దీనికి అజయ్ దేవలోక దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ టామ్ చాకో హీరోగా నటిస్తున్నాడు. కథ, స్క్రీన్‌ప్లే కొత్తగా అనిపిచండంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు నిత్యా మీనన్ తెలిపింది. తన పాత్రకు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa