ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పౌరాణిక సినిమాలతో జనం మనసు గెలవాలని..

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2019, 08:44 PM

అపుడెపుడో.. ఒక రామాంజనేయ యుద్ధం.. పాండవవనవాసం.. లవకుశ.. బీష్మ.. దానవీరశూరకర్ణ.. అదంతా గతం. మరి ఇప్పుడు అంతా.. గ్రాఫిక్స్.. పోర్న్ మైమరపించే మాయాజాలం. కానీ.. 1990 ల్లో బైరవద్వీపం.. సింగీతం శ్రీనివాసరావు మరోసారి పౌరాణిక పాత్రలతో మెప్పు పొందారు. అనంతరం అదే కోవలో కొన్ని సినిమాలు వచ్చినా ఎంఎస్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో గుణశేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా రామాయణం కనువిందు చేసింది. అలనాటి బాల భారతం గుర్తుకు తెచ్చింది. ఆ తరువాత చానాళ్లకు ఈ తరానికి గుర్రాలు.. కత్తియుద్ధాలు పరిచయం చేయటమే కాదు.. మెగా హీరోను రెండో సినిమా మగధీరతో స్టార్ గా మార్చాడు రాజమౌళి. అదే స్పీడుతో యమదొంగ సోషియో ఫాంటసీ.. పూర్తి కత్తియుద్ధాలతో నాటి కాలానికి తీసుకెళ్లి కోటగోడలు బద్దలు కొట్టడం.. శత్రువుపై పద్మవ్యూహాలు.. అన్నీ బాహుబలితో భళా అనిపించుకున్నాడు.
దీంతో మరోసారి పౌరాణిక సినిమాలతో జనం మనసు గెలవాలని.. బాక్సాఫీసు వద్ద కోట్లు లాభాలు పొందాలనే ఆలోచన తెలుగు, హిందీ, కన్నడ, తమిళ నిర్మాతలు.. హీరోలకు వచ్చింది. అయితే గతంలో ఇదే ప్రయత్నం చేసిన బాలయ్యబాబు అర్జునవిజయంతో చేతులు కాల్చుకున్నాడు. నర్తనశాల మొదలు పెడదామని చూసినా సరైన పాత్రలు దొరక్క ముఖ్యంగా సావిత్రి పోషించిన ద్రౌపది పాత్రకు ఎవర్ని ఎంపిక చేయాలనేది తెలియక సినిమాను మూలన పడేశారు. తాజాగా కురుక్షేత్రం సినిమాతో తాజాగా కొత్త సినిమా విడుదలైంది. దర్శకుడు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అంటూ చెప్పారు. రూ. 1000 కోట్లు వెచ్చించి అయినా సరే ఆ సినిమా తీశాక తాను రిటైర్ అవుతానంటూ తేల్చిచెప్పారు. అల్లు అరవింద్ కూడా రూ.500 కోట్లతో రామాయణం, భారతం ఏదో ఒక సినిమాలో తీయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. దగ్గుబాటి రానాతో తాను హిరణ్య కశప సినిమా తీయాలనే ఆలోచన ఎప్పుడో గుణశేఖర్ బయటపెట్టాడు.
హిందీలో మహాభారతం సినిమా కోసం అమీర్ ఖాన్ రెడీ అవుతున్నాడు. మహావీర్ కర్ణ్ కూడా షెడ్యూల్ జరుపుకుంటుంది. సైరా కూడా ఈ నెల 14న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, హిందీ ప్రేక్షకులు నచ్చేలా తీర్చిదిద్దిన సైరా ప్రతిష్ఠాత్మక సినిమాగానే అంచనా వేస్తున్నారు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు కావటంతో అభిమానులు చాలా ఆశగా అక్టోబరు 2 ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఏమైనా.. బ్లాక్ అండ్ వైట్ సినిమా సమయంలో వెండితెరపై దూసిన కత్తులు.. స్వారీ చేసిన గుర్రాలు.. ఇప్పుడు నవతరం ప్రేక్షకులను కనువిందు చేసేందుకు రంగులు. గ్రాఫిక్స్ తో రావటం.. ఇప్పటి యువతకు చరిత్ర గురించి.. ఇతిహాసాల పాఠాలు తెలుసుకునే అవకాశం వచ్చినట్టుగానే సినీవర్గాలు భావిస్తున్నాయి.



 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa