ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చదువుకుంటూనే సినిమాల్లో నటించా : అనుపమ

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2019, 09:14 PM

తెరపై కనిపిస్తాను కాబట్టి సహజంగా నన్నంతా నటిగానే చూస్తుంటారు. కానీ నటన కాకుండా, ఇంకా చాలా కలలే కంటుంటా. వాటిని సాకారం చేసుకొనేందుకు కసరత్తులు కూడా చేస్తుంటా అంటోంది అనుపమ పరమేశ్వరన్‌. అమె దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక. ఇటీవల రాక్షసుడు తో విజయాన్ని అందుకొంది. నటి కంటే ముందు, నేనొక నవతరం అమ్మాయిని. ఒక పనికో, ఒక వ్యాపకానికో పరిమితం కావడం మాకు ఇష్టం ఉండదు కదా అంటోంది అనుపమ. ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయడం ఇష్టం. చిన్ననాటి నుంచీ నాది అదే తీరు. చదువుకుంటూనే సినిమాల్లో నటించా. కానీ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించ లేదు. నటిగా కొనసాగుతున్నా ఇంకా చాలా విషయాలపైకి మనసు మళ్లుతుంటుంది. సెట్‌లో ఉన్నప్పుడు కూడా ఒక చోట కుదురుగా ఉండను. కెమెరా వెనకాల ఏం జరుగుతోంది, ఏ పని కోసం ఎవరెలా కష్టపడుతున్నారో తెలుసు కుంటుంటా. ప్రస్తుతానికి నేను తరచూ కనే కల దర్శకత్వం గుర్తించే. మిగిలిన కలలు గురించి తర్వాత చెబుతా అని చెప్పింది అనుపమ.


 


 


 








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa