ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జైలర్-2'లో ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ

cinema |  Suryaa Desk  | Published : Thu, May 15, 2025, 03:40 PM

రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్-2'లో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సన్‌పిక్చర్స్ సంస్థ, కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. 2023లో విడుదలైన జైలర్‌లో అతిథి పాత్రలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ మెప్పించారు. ఈ చిత్రంలో బాలయ్య ఏపీకి చెందిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ వార్తల ప్రకారం, బాలకృష్ణ (Balakrishna) పాత్ర సినిమాలో కీలకంగా ఉండనుందట. ఆయన రజినీకాంత్‌తో కలసి స్క్రీన్ మీద భారీ ఎలివేషన్ సీన్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ సీన్ సుమారు 5 నిమిషాలపాటు సాగుతుందని, అభిమానులను థియేటర్లలో ఫెస్టివల్ మూడ్‌లోకి తేవడమే లక్ష్యమని టాక్. బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్, రజినీ స్టైల్‌కు ఈ కాంబినేషన్ పెద్ద హైలైట్ అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన మళ్లీ అఘోరా అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే, ‘జైలర్ 2’లో బాలయ్య పాత్రపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇది నిజమైతే, తెలుగు-తమిళ సినీ అభిమానులకు ఇది భారీ విజువల్ ట్రీట్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa