ప్రముఖ హాస్యనటుడు మరియు నటుడు ప్రవీణ్ 'బకాసుర రెస్టారెంట్' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకి ఎస్జె శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వైవ హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. కృష్ణ భగవాన్, షైనింగ్ ఫని, కెజిఎఫ్ గరుడా రామ్ మరియు ఇతర ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఎస్జె మూవీస్ బ్యానర్ కింద లక్ష్మా అచారి మరియు జానార్ధన్ అచారి ఈ సినిమాని నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
![]() |
![]() |