ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ బయోపిక్ చేసేందుకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, దర్శక ధీరుడు రాజమౌళి పోటీ పడుతున్నారు. ఈ ప్రాజెక్టు జక్కన్న చేస్తున్నారన్న వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమిర్ నుంచి కూడా ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. జక్కన్న సమర్పణలో ఫాల్కే బయోపిక్ ప్రాజెక్టును 'మేడ్ ఇన్ ఇండియా' అనే పేరుతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక ఈ మూవీని జక్కన్న తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించనున్నారని, నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నట్లు టాక్ వచ్చింది. తాజాగా ఈ స్టోరీని తారక్‌కు వినిపించగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ఈ స్టోరీలో భారతీయ సినిమా పుట్టుక.. అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.అయితే, ఈ వార్తలు వచ్చిన వెంటనే ఆమిర్ ఖాన్ సైతం 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్‌ను అనౌన్స్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించనుండగా.. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రాజ్ కుమార్ హిరాణీ, అభిజిత్ జోషీ, హిందూకుశ్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్‌లు ఈ బయోపిక్ కోసం నాలుగేళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. 'సితారే జమీన్ పర్' రిలీజైన వెంటనే ఈ బయోపిక్ కోసం ఆమిర్ సిద్ధం కానున్నారని.. ఈ ఏడాది అక్టోబరులోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa