కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి-పురి జగన్నాథ్ యొక్క ప్రాజెక్ట్ సినీ ప్రేమికులలో అపారమైన ఆసక్తిని సృష్టిస్తోంది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బెగ్గర్' అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో టబు ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అయితే, విద్యాబాలన్ ఈ ప్రాజెక్టులో భగం కాదని కొన్ని రిపోర్ట్స్ ధృవీకరించాయి. పూరి జగన్నాథ్ చిత్రంలో విద్యాబాలన్ ఏ పాత్ర కోసం ఎన్నడూ సంప్రదించబడలేదు అని సమాచారం. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీలతో సహా పలు భాషలలో విడుదల అవుతుంది. ఇది పూరి జగన్నాద్ మరియు విజయ్ సేతుపతికి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుంది. ఈ చిత్రానికి పూరి జగన్నద్ నటి-నిర్మాత ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa