ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటివారు "శేష్"ను స్ఫూర్తిగా తీసుకోవాలి : దిల్ రాజు

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 12:15 PM

అడవి శేష్ కథానాయకుడిగా ఇటీవల విడుదలైన 'ఎవరు' చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ ``క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. క్షణం అనే సినిమాను ఓ టీమ్ వర్క్‌తో రూపొందించి చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టి ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు శేష్. తర్వాత `గూఢచారి`తో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు `ఎవరు`తో మరో సక్సెస్‌ని అందుకున్నాడు`` అన్నారు. ``సాధారణంగా మాకు బ్యాగ్రౌండ్ లేదు.. మమ్మల్ని ఎవరు చూస్తారు? అని చాలా మంది అంటుంటారు. అలాంటి వారందరికీ శేష్ ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. మన దగ్గర టాలెంట్ ఉంటే కష్టపడి ఏదైనా చేయవచ్చునని ప్రూవ్ చేస్తూ న్యూ జనరేషన్‌కి బెస్ట్ ఎంగ్జాపుల్ యాక్టర్‌గా రుజువు చేసుకున్నాడు. ఎలాంటి ఫైట్స్, పాటలు లేకుండా ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో ఏదీ లేదు`` అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa