బాలీవుడ్, టాలీవుడ్‌లో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్న పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి తీసుకున్న నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ ఆయుర్వేద కంపెనీ సన్నబడేందుకు వాడే మాత్రలకు ప్రచారకర్తగా ఉండాలని కోరింది. దీనికోసం ఏకంగా రూ. 10 కోట్లు కూడా ఇస్తామని చెప్పింది. డబ్బులు ఎంత ఇచ్చినా తాను ఇటువంటి ప్రకటనలు చేయలేనని తెగేసి చెప్పింది శిల్పాశెట్టి. తాను నమ్మని విషయాలను ప్రజలపై రుద్ది.. వారిని మోసం చేయలేనంటూ సున్నితంగా తిరస్కరించారు.
సరైన ఆరోగ్య పద్ధతులు, ఆహారం తీసుకుంటే ఫిట్‌నెస్ దానంతట అదే వస్తుందని చెప్పారు. శిల్ప తీసుకున్న నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం ఆమె చేసిన ఆలోచన ఎంతో గొప్పదని అంటున్నారు. మిగితా వారు కూడా ఆమెను అనుసరిస్తే తప్పుడు ప్రకటనలతో ప్రజలు మోసపోరని అభిప్రాయపడుతున్నారు.
వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాతో వివాహం అయ్యాక వెండితెరకు దూరమైంది శిల్పాశెట్టి. 13 ఏళ్ల పాటు సినిమాలకు దూరమైనా యోగా వీడియోలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఫిట్‌నెస్, ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలకు సంబంధించి శిల్ప ఒక యాప్ ద్వారా సలహాలు సూచనలు చేస్తున్నారు. ఆహార నియమాలు, ఫిట్‌నెస్ వంటి విషయాలపై ఎవరైనా అడిగి తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. కాగా త్వరలోనే శిల్పాశెట్టి షబ్బీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ‘నికమ్మ’ సినిమాతో మరోసారి తెరపై కనిపించబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa