వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉక్కిరి బిక్కిరి అవుతోంది పంజాబి కుడి రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది రిలీజైపోయాయి ఇప్పటికే. ఇటీవలే మన్మధుడు 2 రిలీజైంది. దేదే ప్యార్ దే- ఎన్జీకే లాంటి భారీ చిత్రాల్లో నటించింది. తదుపరి సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఓ భారీ చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేస్తోంది. అదంతా అటుంచితే ప్రస్తుతం రకుల్ ఏం చేస్తోంది? ఇంత బిజీ షెడ్యూల్స్ ని ఒత్తిడి లేకుండా ఎలా మ్యానేజ్ చేయగలగుతోంది? అంటే .. అందుకు రకుల్ చెంత బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. అలసి సొలసిన శరీరానికి కాస్తంత రిలీఫ్ ఇవ్వడమెలానో రకుల్ కి తెలిసినంతగా వేరొకరికి తెలీదేమో. ఇదివరకూ తన సినిమాల గ్యాప్ లలో విదేశీ టూర్లతో షికార్లు ప్లాన్ చేయడం.. కుటుంబంతో స్పెండ్ చేయడం వంటివి అలవాటుగా సాగించేది. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతోంది. మన్మధుడు 2 సమయంలో రెగ్యులర్ గా జిమ్ పేరుతో శారీరకంగా చాలానే అలసిపోయింది. దాంతో పాటే షూటింగ్ షెడ్యూల్స్ పరంగానూ మానసికంగానూ అలసట తప్పలేదు. ఓవైపు టాలీవుడ్ .. మరోవైపు బాలీవుడ్.. ఇంకో వైపు కోలీవుడ్ .. మూడు పరిశ్రమల్ని మ్యానేజ్ చేస్తోంది.
అందుకే ఈసారి రకుల్ కాస్తంత పెద్ద బ్రేక్ తీసుకుని స్పెయిన్ - ఇబిజ లొకేషన్ కి వెళ్లిపోయింది. రెండు మూడు వారాల ట్రిప్ ఇదని తెలుస్తోంది. అక్కడేం చేస్తోంది? అంటే ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. అదిరిపోయే లొకేషన్ లో ఫుల్ గా చిలౌట్ చేస్తోంది. మొన్ననే మన్మధుడు 2 కోసం స్పెయిన్ కి వెళ్లి వచ్చింది. ఇంతలోనే మళ్లీ అక్కడికే ఎందుకు వెళ్లింది! అంటే అంతగా ఆ డెస్టినేషన్ నచ్చిందట. ఇన్ స్టాలో బులుగు బికినీ ఫోటోల్ని షేర్ చేసి దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. ``పైన నీలాకాశం.. కింద ఇసుక.. ప్రశాంతంగా ఉంది. ఇబిజలో ఉన్నాను`` అని జోష్ చూపించింది రకుల్. అన్నట్టు ఈనెల 29న స్పెయిన్ - ఇబిజలోనే కింగ్ నాగార్జున 60వ బర్త్ డే సెలబ్రేషన్స్ ని అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ చేసింది. అందుకే ఆ ఈవెంట్ ని కవర్ చేసేందుకే అదే డెస్టినేషన్ ని ఎంపిక చేసుకుందా? అన్నది రకుల్ నే కూల్ గా చెబుతుందేమో?
View this post on Instagram
Sky above , sand below ,peace within!! ❤️ happiness all around ! #ibizadiaries @flirtatious_india
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa