ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజశేఖర్ కొత్త సినిమా ఎమోషనల్ థ్రిల్లర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 05:49 PM

రాజశేఖర్ నుంచి ఇటీవల వచ్చిన 'కల్కి' ఆశించినస్థాయిలో ఆయనకి విజయాన్ని అందించలేకపోయింది. దాంతో ఆయన తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక ఎమోషనల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది తాజా సమాచారం. 'బేతాళుడు' సినిమాకి దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఇటీవల ఒక కథను వినిపించగా, వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.


ఈ సినిమాను తమిళ నిర్మాత ధనుంజయన్ నిర్మించనున్నాడు. ధనుంజయన్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించి షూటింగుకి మొదలుపెడతారట. ప్రస్తుతానికి సత్యరాజ్ .. నాజర్.. బ్రహ్మానందంను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే మిగతా ఆర్టిస్టుల .. సాంకేతిక నిపుణుల పేర్లను ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa