ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నానితో హను రాఘవపూడి సినిమా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 06:54 PM

హను రాఘవపూడి పేరు వినగానే నాని హీరోగా ఆయన తెరకెక్కించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' గుర్తుకు వస్తుంది. అంతగా ఈ సినిమా దర్శకుడిగా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత ఆయన చేసిన 'లై' .. 'పడి పడి లేచే మనసు' చిత్రాలు రెండూ అంతగా ఆదరణ పొందలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను నానీకి వినిపించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఇక ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన 'వి' సినిమాను పూర్తి చేయవలసి వుంది. ఈ సినిమాల తరువాత ఆయన హను రాఘవపూడితో కలిసి సెట్స్ పైకి వెళతాడా లేదా అనేది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa