ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాచ్ ధర విని షాకైన రెబల్ స్టార్ ఫ్యాన్స్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 07:22 PM

రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిన ఈ పేరు.. ఇప్పుడు మరోసారి ‘సాహో’తో పీక్ స్థాయికి చేరిపోయింది. ఆయన ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ  చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో డార్లింగ్ ప్రభాస్ అదిరిపోయే రేంజ్‌లో ఎంట్రీ ఇవ్వగా.. ఈవెంట్‌కు వచ్చిన చాలామంది కళ్ళు ప్రభాస్ చేతికి ఉన్న ‘వాచ్’పై పడ్డాయి. ఇక ఫ్యాన్స్ ఆ వాచ్ ధర గురించి గూగుల్‌లో సెర్చ్ చేయగా.. ఒక్కసారిగా అందరి కళ్ళు తిరిగినంత పనైంది.
ఆ వాచ్ బ్రాండ్ పేరు ‘హబ్లట్’ కాగా.. ఎక్కువగా హాలీవుడ్ నటులు ఇలాంటి వాచ్‌లను వాడుతుంటారు. ఇక దీని ధర సుమారు 15 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్.. డార్లింగ్‌కు ఆ వాచ్ భలే ఉందంటూ సోషల్ మీడియాలో షేర్స్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa