ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన డార్లింగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 12:13 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వివాహం గురించి దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఒక ఎన్నారై యువతిని వివాహం చేసుకబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అలాగే అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, వీరిద్దరూ అమెరికాలో కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నారని కథనాలు వచ్చాయి.


ఆ వార్తలపై ప్రభాస్ తాజాగా స్పందించాడు. అనుష్కతో స్నేహం తప్ప ఇంకేమీ లేదని స్పష్టం చేశాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికరంగా స్పందించాడు. `పెళ్లి గురించి ఇంకా క్లారిటీ లేదు. జరగాల్సిన సమయంలో నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. నాది ప్రేమ వివాహం కూడా కావొచ్చ`ని ప్రభాస్ అన్నాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa