ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత ఫుట్ బాల్ కోచ్ బయోపిక్ లో అజయ్ దేవ్ గణ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 12:45 PM

చిత్రపరిశ్రమలో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం అగ్ర హీరోలు సైతం ఈ బయోపిక్ ల మోజులోనే ఉన్నారు. భారత ఫుట్‌బాల్‌ జట్టుకు కోచ్‌గా ఎనలేని సేవలు అందించిన వ్యక్తి సయ్యద్‌ అబ్దుల్‌ రహీం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మైదాన్‌’  చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అజయ్‌ దేవగణ్‌ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.


సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమాను నిర్మించనున్నట్లు బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ జీ స్టూడియో 2018 జులైలోనే ప్రకటించినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన వివరాల కోసం అజయ్‌, ఫుట్‌బాల్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు అజయ్‌ తన ట్విటర్‌లో ఫస్ట్‌లుక్‌ను పోస్ట్‌ చేస్తూ మైదాన్‌ కిక్స్‌ ఆఫ్‌ టు డే అని ట్వీట్‌ చేశారు. అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ రహీం నాయకత్వంలో 1951, 1962 సంవత్సరాలలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు విజయం సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa