టాలీవుడ్ మాస్ మహారాజా రవి తేజ అభిమానులు మాస్ జాతర విడుదల కోసం ఎదురుచూస్తుండగా అతని 76వ చిత్రం గురించి ఒక ఉత్తేజకరమైన ప్రకటన వచ్చింది. ఈరోజు ఉదయం 9:02 గంటలకు ఈ సినిమా ఆవిష్కరించబడుతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం యొక్క అధికారిక పూజా వేడుక కూడా ఉదయం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయిన ఈ చిత్రానికి కిషోర్ తిరుమాల దర్శకత్వం వహిస్తున్నట్లు ధృవీకరించబడింది. అంతేకాకుండా ఈ చిత్రానికి మేకర్స్ టైటిల్ గా అనార్కాలి ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఎల్‌సి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa