ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమోషనల్‌ థ్రిల్లర్‌ కు రాజశేఖర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 07:24 PM

టాలీవుడ్‌ సినీయర్‌ హీరో డా.రాజశేఖర్‌ కొత్త సినిమాను ప్రారంభించ బోతున్నారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొంద నున్న ఈ సినిమాను క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత డా.జి.ధనుంజయన్‌ నిర్మిస్తున్నారు. సింగిల్‌ లైన్‌ కథ వినగానే రాజశేఖర్‌ వెంటనే ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విశేషం. ఈ సినిమాలో సత్యరాజ్‌, నాజర్‌, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవల విడుదలైన కిల్లర్‌ సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్‌. కె.కింగ్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించబోతున్నారు. తెలుగు క్షణం ను తమిళ్‌లో శిబిరాజ్‌తో సత్య గా తీయడంతో పాటు బేతాళుడు సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్‌ కృష్ణమూర్తి ఈ సినిమాకు మెగాఫోన్‌ పట్టనున్నారు. హీరోయిన్‌తో పాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు. సినిమా టైటిల్‌ నిర్ణయించి త్వరలో షూటింగ్‌ మొదలు పెడతామని నిర్మాత జి.ధనుంజయన్‌ చెబుతున్నారు. సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేసి 2020 మార్చిలో సినిమాను విడుదల చేస్తామంటున్నారు.




 


 


 








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa