ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SSMB29' తదుపరి షెడ్యూల్ ఎక్కడంటే..!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 05, 2025, 07:51 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌలితో కలిసి చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా 'SSMB 29' అనే పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనాలు అధికంగా ఉన్నాయి. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని మేకర్స్ జూన్ 10న వారణాసిలో ప్రారంభించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. SSMB29 ను ప్రముఖ చిత్రనిర్మాత కెఎల్ నారాయణ 1,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌కు చెందిన కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. దేవా కట్ట  డైలాగ్ రైటర్ గా, విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త MM కీరావాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa