ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్ర మనస్తాపానికి గురైన బాబా భాస్కర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 08:40 PM
బిగ్ బాస్ సీజన్ 3 సోమవారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా జరిగింది. అయితే ఈ సారి కెప్టెన్ అయిన ఆలీకి ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేసే అధికారం వచ్చింది. దానిలో భాగంగా ఆలీ బాబా భాస్కర్ ని నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆలీ ఈ విధంగా చేసినందుకు బాబా భాస్కర్ కంట తడి పెట్టుకున్నారు. తనని నామినేట్ చేయకుండా ఉండడానికి ఆలీని బాబా భాస్కర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాడు. 

మిగతా వాళ్ళెవరూ అసలు ప్రయత్నమే చేయలేదు. ఆలీ కూడా బాబా భాస్కర్ తో మీరు ఏదీ సీరియస్ గా తీసుకోరు. ఇక నుండి సీరియస్ గా ఉండండి అని చెప్పడంతో నేను ట్రై చేస్తానని చెప్పాడు. ఎవరైనా వాళ్ళ పద్దతి మార్చుకోవడానికి టైం పడుతుంది. అదీ గాక బాబా భాస్కర్ చేసే ఫన్ కొందరికి నచ్చట్లేదని, ర్యాగింగ్ ని అందరూ ఒకేలా స్వీకరించలేరని చెప్పాడు. నిజానికి బాబా భాస్కర్ పై ఇప్పటి వరకు ఇలాంటి కంప్లైంట్ రాలేదు.అయినా తనని తాను మార్చుకుంటానని చెప్పాడు. 
ఇద్దరి మధ్య నామినేషన్ గురించి సంభాషణ జరిగి, బాబా చెప్పిన దానికి ఓకే అన్న తర్వాత కూడా నామినేట్ చేయడంతో ఇచ్చిన మాట తప్పాడని బాబా భాస్కర్ ఏడ్చేసాడు. ఆలీ చేసిన దానికి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.దీంతో నెటిజన్లు ఆలీ మీద విరుచుకు పడుతున్నారు. మరి ముందు ముందు వీరిద్దరి మధ్య ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది.  

చెప్పిన వెంటనే మార్చుకోవడానికి బాబా భాస్కర్ మెషిన్ కాదు కదా!. బాబా భాస్కర్ అలా చెప్పాక కూడా ఆలీ నామినేట్ చేయడం ఆయన్ని బాధపెట్టింది.బాబా భాస్కర్ ని సేవ్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆలీ అలా చేయలేదు. అసలు బాబా భాస్కర్ ని నామినేషన్ లో ఉంచడానికి ఎంచుకోవడమే ఆలీ  చేసిన తప్పుగా భావిస్తున్నారు. 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa