ప్రస్తుతం సినిమా పాటలు వెర్రితలలు వేస్తున్నాయని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. గాయకులు కావాలనుకునే వారికి ఈటీవీలో ప్రసారమవుతున్న ‘పాడుతా తీయగా’ వేదిక ఒక కార్యశాల వంటిదని చెప్పారు. ప్రముఖ గాయకులు ఏసుదాసు, చిత్రతో కలిసి నవంబర్ 30న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మైదానంలో భారీ సంగీత విభావరి నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు రామానాయుడు స్టూడియోలో తన కుమారుడు చరణ్‌తో కలిసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాయనీగాయకులకు సినిమానే గమ్యం కాకూడదన్నారు. నేటి తరం గాయనీ గాయకులకు ప్రతిభ ఉన్నప్పటికీ వృత్తిపరంగా నిలదొక్కుకోవడం ప్రశ్నార్థకరంగా మారుతోందని చెప్పారు. తెలుగులో తొలిసారిగా చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. పూర్తి వాణిజ్య విలువలతో కూడిన పాటలను శ్రోతలకు వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు బాలు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa