ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని-శివ నిర్వాణ కాంబినేషన్ లో మరో సినిమా

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2019, 07:26 PM

నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గ్యాంగ్ లీడర్' సిద్ధమవుతోంది. ఆ తరువాత సినిమాగా ఆయన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత నాని ఏ దర్శకుడితో .. ఏ సినిమా చేయనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో వుంది.


'వి' తరువాత ప్రాజెక్టును తాజాగా నాని సెట్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే నానీని దర్శకుడు శివ నిర్వాణ కలిసి ఒక కథ చెప్పాడట. ఆ కథ నానీకి బాగా నచ్చేసిందని అంటున్నారు. అంతేకాదు కొంతకాలం క్రితం తనకి 'నిన్నుకోరి' సినిమాతో హిట్ ఇచ్చిన కారణంగా, ఇటీవల 'మజిలీ' సినిమాతోను శివ నిర్వాణ తన సత్తా చాటుకోవడం వలన వెంటనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa