సూర్య-కాజల్ అగర్వాల్ మళ్లీ తెరపై కనిపించనున్నారా? ప్రస్తుతం చెన్నై ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో ప్రచారంలో ఉన్న వార్తల్లో ఇదొకటి. దాదాపు ఏడేళ్ల క్రితం ఈ ఇద్దరూ మాట్రాన్ అనే తమిళ చిత్రంలో నటించారు. బ్రదర్స్ పేరుతో ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. ఇప్పుడు సూర్య హీరోగా శివ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోనే కాజల్ అగర్వాల్‌ని కథానాయికగా అడిగారట. కాజల్‌కి కథ కూడా వినిపించారని, నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలాఖరున ఆరంభం కానుంది. నగర నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. కెమెరామేన్‌గా వెట్రిని, స్టంట్ మాస్టర్‌గా దిలీప్ సుబ్బరాయన్‌ని తీసుకున్నారు. కాజల్ అగర్వాల్ గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa