ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 8న సినీ మహోత్సవం

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2019, 05:40 PM

తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ యూనియన్‌ సినీ మహోత్సవం..రథసారథుల రజతోత్సవం సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రొడక్షన్‌ మేనేజర్లందరూ కలిసి చేస్తున్న ఈ సిల్వర్‌ జూబ్లీ ఈవెంట్‌ కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బ్రోచర్‌ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ రజతోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ అమ్మిరాజు, మా వైస్‌ ప్రెసిడెంట్‌ డా.రాజశేఖర్‌, మా అధ్యక్షుడు వి.కె.నరేష్‌, శివ, బాలాజీ, హేమ, రాజీవ్‌ కనకాల, ఆర్టిస్ట్‌ రఘు, వెన్నెల కిషోర్‌, నిర్మాత అశోక్‌, నిర్మాత ఎమ్‌.ఎల్‌.కుమార్‌ చౌదరి, నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌, ఉత్తేజ్‌, డైరెక్టర్‌ బాబీ, బొమ్మరిల్లు భాస్కర్‌, సంపూర్ణేష్‌బాబు, సి.కల్యాణ్‌, హీరోయిన్‌ ప్రగ్వా జస్వాల్‌, అల్లరి నరేష్‌, సందీప్‌ కిషన్‌, హీరోయిన్‌ రెజీనా పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa