దశాబ్దం క్రితం సునీల్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మర్యాద రామన్న చిత్రాన్ని అజయ్ దేవగణ్ బాలీవుడ్‌లో సన్ ఆఫ్ సర్దార్‌గా రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిదే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా సన్నాఫ్ సర్దార్ 2 అంటూ మరో చిత్రాన్ని రూపొందించారు.మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూలై 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చేస్తూ ఆసాంతం మంచి కామెడీ ప్రధానంగా సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa