సమంత తాను నటించిన "ఓ బేబీ" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. తన నెక్స్ట్ సినిమా తమిళ చిత్రం "96" తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. ఎందుకనో ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లడానికి ఆలస్యమవుతుంది. దీని తర్వాత సమంత మరో చిత్రానికి కమిట్ కావడం లేదు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం వరల్డ్ బాడ్మింటన్ చాంపియన్ పి.వి.సింధు బయోపిక్‌లో సమంత నటించనుందట. నిజానికి సోనూసూద్ ఈ చిత్రాన్ని బాలీవుడ్ హీరోయిన్‌తో తెరకెక్కించాలనుకున్నారట. అయితే వర్కవుట్ కాకపోవడంతో ఈ సినిమాను సమంతోనే చేయాలనుకుంటున్నారని టాక్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa