భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్ నిర్మించేందుకు నటుడు సోనూసూద్ నిర్మాణ హక్కులను దక్కించుకున్నారు. ఈ మేరకు త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సోనూ. "ఓ బేబీ" సినిమాతో విజయాన్ని అందుకున్న సమంతను ఈ సినిమాలో సింధు పాత్రకు సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా సింధు ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ.. దీపికా పదుకొణే తన పాత్రలో నటించాలని భావిస్తునన్నారు. ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో పాటు మంచి నటి అని చెప్పింది. అంతేకాదు నా పాత్రలో దీపికాని చూడాలని అనుకుంటున్నానన్న సింధు…ఫైనల్ నిర్ణయం మేకర్స్‌దే అంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa